బ్రేకింగ్ : అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ !

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం టెన్షన్ కలిగిస్తోంది..ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ నటీనటులు కరోనా బారిన పడ్డారు. కొంతమంది సీనియర్ మోస్ట్ నటులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా అమీర్ ఖాన్ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే ఆయన కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఆయన ఈ ఉదయం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు..ఈ నెల మొదట్లో అమీర్ ఖాన్ ముంబైలో జరిగిన ‘కోయీ జానే నా’ మూవీ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. ఆ సమయంలో సోషల్ మీడియా నుంచి తాను వైదొలగడం మీద జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చాడు.