లర్ట్‌ : పశ్చిమ బెంగాల్‌లో బయటపడ్డ మరో వైరస్‌

-

పశ్చిమ బెంగాల్ లో అడెనో అనే కొత్త వైరస్ కలకలం రేపుతోంది. దీని కారణంగా పశ్చిమ బెంగాల్‌లో 24 గంటల్లో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వారంతా రెండేళ్లలోపు వారే కావడం ఎంతో బాధ కలిగిస్తోంది. ఈ వైరస్ లక్షణాలతో ఉన్నావారి నమూనాలను పరీక్షల కోసం పంపామని, ఫలితాలు రావల్సివుందని వైద్య అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 అడెనో వైరస్ మరణాలు నమోదైయ్యాయని, వారిలో 8 మందికి పలు సమస్యలు ఉన్నాయిని ప్రభుత్వం తెలిపింది. 121 ఆస్పత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాలు 5 వేల పడకలను సిద్ధంగా ఉంచామని తెలిపింది. రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్ఐ కేసులు నమోదైయ్యాయని వెల్లడించింది.

Why adenovirus has doctors in West Bengal concerned - India Today

ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణమని.. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అడెనో వైరస్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో చర్చించి.. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వైద్య సిబ్బంది, ఇతర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అత్యవసర హెల్ప్‌లైన్ 1800–313444–222 నెంబర్లను ప్రకటించారు. అడెనోవైరస్ సోకిన వారికి నిర్దిష్ట చికిత్సా విధానం, ఆమోదించిన యాంటీవైరల్ మందులు లేవని వైద్యులు తెలిపారు. నొప్పి నివారణ మాత్రల ద్వారా తేలికపాటి లక్షణాలు తగ్గుతాయని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని అన్నారు. ఎల్లప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. కావున మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. సాధారణ లక్షణాలే అని అజాగ్రత్త వహించకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news