జగన్ కు ఎమ్మెల్యే లను డీల్ చేయడం తెలియదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

-

ఏపీలో జగన్ పాలనలో ప్రజలు అందరూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతూ సంతోషంగా ఉన్నారు. సగానికి పైగా ప్రజలు మళ్లీ సీఎం జగన్ గెలవాలని ప్రార్థనలు చేస్తుంటే… సొంత పార్టీ నాయకులు కొందరు ఆయన ఓటమిని కోరుకోవడం నిజంగా దురదృష్టం అని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఆర్ ఇన్ డైరెక్ట్ గా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరి వైసీపీ ఎమ్మెల్యే డైరెక్ట్ గా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది

ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ మాట్లాడుతూ పాలన లో జగన్ కు ఇంకా అనుభవం రాలేదని… ఇంకో 5 సంవత్సరాలు ఉంటేనే మరింత అనుభవం వస్తుంది అని చెప్పారు. ఇక అధిష్టానం పైన కార్యకర్తలు మరియు ఎమ్మెల్యే లకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని అంటూనే… ఎమ్మెల్యే లను ఎలా డీల్ చెయ్యాలో జగన్ కు తెలియదని కొసమెరుపుగా సెన్సేషనల్ కామెంట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news