ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి సోదరులు, టీడీపీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి. టీడీపీని ఇటీవలే వీడిన ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. టీడీపీని తమ సోదరుడు వీడినప్పటికీ ఆ పార్టీలోనే వారు కొనసాగుతున్నారు.
అయితే, పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ నెల 23న వైసీపీలో వీళ్లిద్దరూ చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ను ఇప్పటికే వీళ్లిద్దరూ సంప్రదించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో… ఈ వార్తలు పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి… బలమైన నేతలుగా ఉన్న వారు కూడా పార్టీని మారడంతో క్యాడర్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది.
ఒక పక్క చంద్రబాబు జిల్లాల పర్యటనలతో క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నా సరే నాయకులు మాత్రం పక్క చూపులు చూస్తూనే ఉన్నారు. అధికార వైసీపీకి బలం ఉండటం, తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో బలపడే అవకాశం లేకపోవడంతో నేతలు భవిష్యత్తు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బలమైన క్యాడర్ ఉన్న నాయకులు పార్టీ మారడంతో ఇప్పుడు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు శభాష్ అంటూ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముఖ్యమంత్రి జగన్ ని కొనియాడారు. ఈనెల 23న జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడానికి వస్తున్న జగన్‌కు ఆయన స్వాగతం పలికారు. ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనతో రాయలసీమ యువతకు ఎంతో మేలు చేస్తుందని, రాయలసీమ ప్రజలకు ఎన్నో మేలులు చేకూర్చుస్తాయని, స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జగన్ చెప్పడంతో జమ్మలమడుగు రూపురేఖలు మారబోతున్నాయని, వైఎస్ బతికుంటే స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో పూర్తయ్యేదని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో సీమ యువతకు ఎంత మేలు చేస్తుందని అన్నారు. ఈనెల 23న వైసీపీలో చేరుతున్నారా? అని అడగగా… ఎం చెప్పలేదు… శంకుస్థాపన కార్యక్రమానికైనా హాజరవుతున్నారా? అని అడగగానే… పిలిస్తే వెళ్తా అన్నారు.