షాకింగ్: ”ఆదిపురుష్” సినిమా పరిస్థితి డమాలేనా..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ కానుంది.  ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి  ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్  లో గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అదే సమయంలో కొంత మంది  హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కూడా  ‘ఆది పురుష్’ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

దీనితో ఆదిపురుష్ టీజర్‌కు వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ పై దర్శకుడు ఓం రౌత్ మరోసారి వివరణ ఇచ్చారు. ఈ సినిమాను మేము ఎంతో రీసెర్చ్ చేసి, కష్టపడి తీశామని సినిమాపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. కాని ఈ సినిమా కంటెంట్, క్వాలిటీ విషయంలో చాలా మందికి నమ్మకం లేకుండా వున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు  ఆదిపురుష్ టీజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేను కూడా ఆదిపురుష్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిజమైన పాత్రలతో రామాయణాన్ని తీసి వుంటారని ఆశించాను.కానీ, టీజర్ చూశాక యానిమేషన్ సినిమాను రూపొందించారని అర్ధమయ్యింది. సినిమా తీసే ముందే అభిమానులకు యానిమేషన్ సినిమా తీస్తున్నాం అని చెబితే ఈ గోల అంతా వుండేది కాదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అందరూ బాహుబలి రేంజ్ లో ఉ ఊహించుకుంటే అది టీవి యానిమేషన్ సినిమా లాగా అనిపించింది అని, సినిమా డైరెక్టర్  ప్రేక్షకులు మోసం చేశారని నేను భావిస్తున్నా అని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు మంచు విష్ణు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా ముందు ముందు ఎలాంటి కామెంట్స్ వినాల్సి వస్తుందో అని  తల కొట్టుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version