అసమ్మతి ఎమ్మెల్యేలకు ఆదిత్య ఠాక్రే స్ట్రాంగ్ వార్నింగ్!

-

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శివసేన పార్టీకి చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. ఈ క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం, రెబల్స్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే.. లోక్‌నాథ్ షిండేపై విరుచుకుపడ్డాడు.

ఆదిత్య ఠాక్రే
ఆదిత్య ఠాక్రే

తిరుగుబాటు ఎమ్మెల్యేలు దేశద్రోహులని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. శివసేనకు ద్రోహం చేసిన వారిని మహారాష్ట్ర ఎప్పటికీ క్షమించదన్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎప్పటికీ తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. దమ్ముంటే శివసేన పార్టీకి రాజీనామా చేసి రెబల్ ఎమ్మెల్యేలు గెలవాలని సవాల్ విసిరారు. పార్టీని ఎదుర్కొవడానికి దమ్ము లేక గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి దాక్కున్నారని ఆరోపించారు. రెబల్స్ ఎమ్మెల్యేలకు కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, ఒకటి బీజేపీలో చేరడం లేదా ప్రహార్‌లో చేరడమని ఆదిత్యఠాక్రే తెలిపారు. మీకు ఏ ఆప్షన్ కావాలో మీరే సెలక్ట్ చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news