పొట్టి క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ ఫార్మాట్‌లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. 211 మ్యాచుల్లోనే అతను ఈ ఘనత సాధించడం విశేషం. అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రికార్డును ఆండ్రూ టై బ్రేక్ చేశాడు. రషీద్ 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బాజ్‌లేను ఔట్ చేసి 300 వికెట్ సాధించాడు.
బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) 2023 సీజన్ టైటిల్‌ను పెర్త్ స్కార్చర్ సొంతం చేసుకుంది. బ్రిస్బేన్ హీట్ టీమ్‌తో శనివారం పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన పెర్త్ స్కార్చర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదో టైటిల్‌ను ముద్దాడిన పెర్త్ స్కార్చర్.. బీబీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్ కెప్టెన్ అష్టన్ అగర్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో విజయానికి బాటలు వేయగా.. కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
పొట్టి క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 222 మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. 2020లో రషీద్ ఖాన్, మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. సీపీఎల్ టోర్నీలో బార్బడోస్ ట్రిడెంట్‌కు ఆడిన అతను సెయింట్ లూసియా జౌక్స్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని ఔట్ చేయడంతో 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు.