భారత రత్న అవార్డు అందుకున్న అద్వానీ

-

మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  భారత రత్న  అవార్డు ప్రదానం చేశారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రధానం చేయాలని నిర్ణయించారు.

96 ఏళ్ల అద్వానీ వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధాని ఆయన నివాసానికే వెళ్లి పురస్కారం అందించారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అద్వానీ పలుమార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీకి గత ఫిబ్రవరిలో కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.

అలాగే బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌, మాజీ ప్రధానమంత్రులు పీవీ నర్సింహారావు, చౌదరీ చరణ్‌ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. పీవీ తరపున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు భారతరత్నను స్వీకరించారు. చరణ్‌ సింగ్‌ తరపున ఆయన మనుమడు జయంత్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, క

Read more RELATED
Recommended to you

Latest news