‘హార్ట్‌ఎటాక్‌’ వచ్చినప్పుడు ఆ సమయమే కీలకం..!

-

మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన భాగం గుండె కావడంతో ప్రతి ఒక్కరూ దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్యులు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుది. హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు మొదటి గంటే అత్యంత కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే సరఫరాలో ఏదైనా ఆటంకం కల్గితే వెంటనే గుండె నొప్పి వచ్చి ఆక్సీజన్‌తో కూడిన మంచి రక్తం గుండెకు సరఫరా కాక హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది.

చాలా కేసుల్లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన కొన్ని గంటల తర్వాతనే వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కడం లేదు. హార్ట్‌ఎటాక్‌ వచ్చిన మొదటి గంట తర్వాతనే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుందని, అందుకే ఆ మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారన్నారు. ఏమాత్రం ఛాతీలో నొప్పి, ఇబ్బందిగా ఉన్నట్లు అనుమానం వస్తే వైద్యులను సంప్రదించాలి.

ముందే సంకేతాలు..

ప్రస్తుతం ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు కొందరు అసిడిటీ అని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రమాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్‌ వచ్చి మరణాలు సంభవిస్తున్నాయని అంటుంటారు. కానీ.. నిజానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు వారి శరీరం అనేక సంకేతాలు ఇస్తుందని డాక్టర్‌ తెలిపారు. నిత్యం వ్యాయామం, మధ్యం, ధూమపానికి దూరంగా ఉండటం, క్రమశిక్షణ పరమైన జీవన విధానం, సరైన సమయానికి భోజనం చేయడం ఇలాంటి అలవాట్లు చేసుకుంటే హార్ట్‌ఎటాక్‌ నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news