ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలకు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ నేత ,బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సీనియర్ నేతల సమక్షంలో విజయేందర్ సింగ్ కి కాషాయం పార్టీలో చేరారు. ఈ పార్టీ మార్పులు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడంపై బాక్సర్ విజేందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న మోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను మీరు రీపోస్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీలో ఎందుకు చేరారు?’ అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘రాహుల్ ట్వీట్ను రీపోస్ట్ చేశాక నిద్ర పోయా అని ,లేచిన తర్వాత ఏదైనా మంచి చేయాలని భావించి బీజేపీలో చేరా’ అని పేర్కొన్నారు.కాగా, సుమలత అంబరీష్ కూడా బిజెపిలో చేరనున్నట్టు ప్రకటించారు. అంతకుముందు మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీగా సుమలత ఎన్నికయింది .దీంతో ఆమె రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూటమికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పారు.