వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం తీవ్రతరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కాగ శుక్రవారం.. ఢిల్లీకి వెళ్లిన మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో జరిగిన సమావేశంపై మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను నూకలు తీనాలని కేంద్ర మంత్రి అవమానించారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
ఇక కేంద్రంపై పోరాటం తీవ్రం చేయాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల తీర్మానాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉగాది తర్వాత ఢిల్లీలో పోరాటం చేద్ధామని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి సమస్య ఎంటని ప్రశ్నించారు. కాగ సీఎం కేసీఆర్ తో జరిగిన సమావేశం పూర్తి వివరాలను.. భవిష్యత్తు కార్యాచరణను నేడు మంత్రులు ప్రకటించనున్నారు.