కృష్ణాలో ‘సైకిల్’కు మళ్ళీ కలిసిరాదా?

-

కంచుకోట లాంటి జిల్లాలో ఇంకా సైకిల్ ఎదురీతున్నట్లే కనిపిస్తోంది…గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ…వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి కృష్ణాలో సత్తా చాటేలా కనిపించడం లేదు. మామూలుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కాబట్టి..ఇక్కడ మొదట నుంచి టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ దాదాపు మంచి ఫలితాలే వచ్చేవి..కాకపోతే గత ఎన్నికల్లో టీడీపీపై వ్యతిరేకత…జగన్ వేవ్ వల్ల…కాస్త దారుణమైన ఫలితాలు వచ్చాయి.

ఉమ్మడి కృష్ణాలో మొత్తం 16 సీట్లు ఉండగా, అందులో 14 సీట్లు వైసీపీ గెలుచుకుంది..టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఇందులో ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి ఒక ఎమ్మెల్యే మిగిలారు. అయితే నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవుతూ వస్తుంది. దాదాపు సగం స్థానాల్లో టీడీపీ పట్టు సాధించినట్లు కనిపిస్తోంది.

అయితే టీడీపీ బలం ఇది కాదు…ఇక్కడ దాదాపు 80 శాతంపైనే సీట్లు గెలుచుకునే కెపాసిటీ గతంలో ఉండేది. కానీ ఇప్పుడు 50 శాతం లోపే సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదు..వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే సరిగ్గా ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ కనిపిస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఒకసారి టీడీపీ పరిస్తితి కాస్త మెరుగ్గా ఉందనుకునే నియోజకవర్గాలు వచ్చి…పెనమలూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్, బందరు, జగ్గయ్యపేట. అలాగే విజయవాడ తూర్పు టీడీపీకి సిట్టింగ్ సీటు. ఇక కొన్ని స్థానాల్లో టీడీపీ పెద్దగా పుంజుకోలేకపోతుంది. గుడివాడ, గన్నవరం, పామర్రు, అవనిగడ్డ, తిరువూరు, నూజివీడు, కైకలూరు స్థానాల్లో పార్టీ పికప్ కాలేదు.

అయితే పెడన, విజయవాడ వెస్ట్ సీట్లలో జనసేనతో పొత్తు బట్టి పికప్ అయ్యేలా ఉంది. కైకలూరు, అవనిగడ్డ స్థానాల్లో కూడా అంతే. ఇక కొద్దో గొప్పో నందిగామలో వైసీపీకి టఫ్ ఫైట్ ఇస్తుంది. మొత్తానికి చూసుకుంటే కృష్ణాలో సైకిల్ పూర్తి స్థాయిలో సత్తా చాటేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news