కొలంబో: మరోసారి గణరంగంగా మారింది శ్రీలంక దేశం. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకే నేరుగా దూసుకెళ్లారు ఆందోళనకారులు. దీంతో ఇంటి నుంచి పరారయ్యాడు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.
అయితే.. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో… ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు ఆర్మీ అధికారులు. అలాగే.. ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేశారు. అయితే.. ఈ సంఘటనలో.. 26 మంది ఆందోళనకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అటు… ఆర్మీ అధికారులకు కూడా.. తీవ్ర గాయలు అయ్యాయి. .. ఇప్పటికీ… అధ్యక్షుడు రాజపక్సే ఇంటి దగ్గర ఆందోళనకారులు మరియు ఆర్మీ అధికారుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. దీంతో ఒక్కసారిగా రణరంగంగా మారింది శ్రీలంక కంట్రీ. ఇక శ్రీలంక ప్రస్తుత పరిస్థితులపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా… గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభం లో కూరుకుపోయింది శ్రీలంక దేశం. తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఆ దేశం.