ట్విటర్ సంస్థను కొనుగోలు చేయాలని బిలినియర్ ఎలాన్ మస్క్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. సుమారు 44 బిలియన్ డాలర్లకు దాన్ని ఆయన స్వంతం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ డీల్ నుంచి మస్క్ తప్పుకున్నాడు. విలీన ఒప్పందం లోని పలు నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ట్విట్టర్ తమ నివేదికలో పేర్కొన్నట్లు 5 శాతం కంటే ఎక్కువ స్పామ్ ఖాతాలు ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సిందే అని మస్క్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అప్పటివరకు డీల్ ముందుకు కదలదని పలుమార్లు తేల్చిచెప్పారు. కాగా ఇప్పుడు ఏకంగా డీల్ నే రద్దుచేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మస్క్ యూటర్న్ ని ట్విట్టర్ తీవ్రంగా పరిగణిస్తోంది. మస్క్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. మస్క్ తో అంగీకరించిన ధర, నిబంధనల లావాదేవీలను కొనసాగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని.. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని బోర్డు యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు.
The Twitter Board is committed to closing the transaction on the price and terms agreed upon with Mr. Musk and plans to pursue legal action to enforce the merger agreement. We are confident we will prevail in the Delaware Court of Chancery.
— Bret Taylor (@btaylor) July 8, 2022