కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. “ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశం లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో అందరూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీతోనే ఉంటుంది.” అని సోనియా గాంధీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యువతతో పాటు పలువురు మాజీ సైనికులు, రక్షణ నిపుణులు కూడా అగ్నిపధ్ పధకాన్ని ప్రశ్నిస్తున్నారని యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని సోనియా గాంధీ అన్నారు. ఆర్మీ లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ల విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను అర్థం చేసుకోగలనని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ సమస్యలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో సోనియాగాంధీ చికిత్స పొందుతున్నారు.