ఇవన్నీ బాగున్నాయి..ఏటా మూడు వేల కోట్ల రూపాయలు బీమాకే చెల్లిస్తన్నామని చెబుతున్నారే మరి! అందులో కౌలు రైతులకు అందేది ఎంత? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీనిపై కూడా మంత్రి మాట్లాడితే మిగిలిన విషయాల్లో పారదర్శకత ఎంత ? లేదా రైతుల సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న విజన్ ఎంత ? అన్నది తేలిపోతుంది.
ఇదే సందర్భంలో చంద్రబాబును ఉద్దేశించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా తామే చెల్లించామని అంటున్నారీయన. ఇదంతా ప్రభుత్వ వాదన కానీ రైతు వాదన మరోలా ఉంది. అసలు కనీసం కాలువల పూడికలకు కూడా నిధులు కేటాయించకుండా, కనీసం పంటల కాలువల నిర్వహణకు కూడా దృష్టి కేంద్రీకృతం చేయకుండా ఇంత అవాస్తవాలు ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నాయి. వీలున్నంత వరకూ రైతులనే కాదు కౌలు రైతులనూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది.