ఇవాళ ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు చేశారు.
మొత్తం ఓటర్లు ( పిసిసి డెలిగేట్లు) సంఖ్య 9,937 కాగా, ఓటు వేసిన మొత్తం “పిసిసి డెలిగేట్ల” సంఖ్య 9,477 గా ఉంది. మొత్తం 38 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిన్న ఉదయం వరకు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాయి మొత్తం 68 “బ్యాలట్ బాక్సులు”. అన్ని “బ్యాలట్ బాక్సులు” లో ఉన్న మొత్తం ఓట్లను కలిపిన తర్వాత, ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
ఇరువురు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లను విడివిడిగా, “బ్యాలట్ పేపర్లు”ను చిన్న, చిన్న కట్టలుగా కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కట్టలో 25 “బ్యాలట్ పేపర్లు”, ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పోలైన 9,477 ఓట్లలో సగాని కంటే ఎక్కువుగా ఒక్క ఓటు వచ్చిన ( అంటే 4740 ఓట్లు) అభ్యర్ది విజయం సాధించినట్లుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం, అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఒక్కో అభ్యర్దికి ఐదుగురు ఏజెంట్లు కూడా ఉంటారు.