హైదరాబాద్​లో విమానాల రిపేర్ సెంటర్..ప్రారంభించిన కేటీఆర్

-

హైదరాబాద్‌ మహా నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే తొలిసారిగా విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం హైదరాబాద్​లో ఏర్పాటు కానుంది. ఈ కేంద్రాన్ని ఫ్రాన్స్​కు చెందిన సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌ లో ప్రారంభించనుంది. విమాన యాన రంగ ఉత్పత్తులను తయారు చేస్తున్న సా ఫ్రాన్… మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

ఇందులో భాగంగానే.. 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్‌ లో పెట్టనుంది. ఇందులో విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు జరుగనుండగా… ఇండియాలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదే కావడం గమనార్హం.

పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తిచేసే దిగ్గజ కంపెనీల్లో ఒకటి సాఫ్రాన్ అన్నమాట. అయితే.. ఈ కేంద్రాన్ని కాసేపట్లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్. శంషాబాద్ లో ఈ సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్ &పవర్ ఫెసిలిటీ సెంటర్ లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news