సీనియర్ నటి మహాలక్ష్మి మేన కోడలు ఐశ్వర్య రాజేష్..టాలీవుడ్ ఇండస్ట్రీలోకి క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణ మూర్తి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలో ఢీ గ్లామర్ పాత్రతో మ్యాజిక్ చేసిన ఈ సుందరి తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
అందాల ఆరబోత కంటే కూడా నటనపైనే ఫోకస్ చేసి తను మంచి పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఐశ్వర్య తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తోంది. ఇప్పటికే తన నటనతో సత్తా ఏంటో చూపించింది.
సోషల్ మీడియాలోనూ ఈ సుందరి యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ లో గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలో అలా చూపులతోనే కవ్విస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు.. ‘యూ ఆర్ మై క్రష్, అందంతో ఐస్ చేస్తున్నావ్ ఐష్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సుందరి ‘హర్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ఇదం పోరుల్ ఇవల్’ పిక్చర్స్ లో నటిస్తోంది.
View this post on Instagram