IPL 2022 : ఔట్‌ ఇచ్చారని డ్రెస్సింగ్‌ రూంలో మాథ్యూ వేడ్ రచ్చ..వీడియో వైరల్‌

-

కీలకమైన మ్యాచ్‌ లో ఆర్జీబీ గెలిచి.. ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గుజరాత్‌ పై 8 వికెట్ల తేడాతో నిన్న మ్యాచ్‌ గెలిచింది బెంగళూరు. ఫాంలో లేక సతమతమౌవుతున్న విరాట్‌.. ఈ మ్యాచ్‌ లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అయితే.. ఈ గెలుపుతో.. బెంగళూరు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు అయినట్లు కాదు.

శనివారం ముంబై తో జరిగే మ్యాచ్‌ లో ఢిల్లీ విజయం సాధిస్తే.. బెంగళూరు బదులు ఢిల్లీనే ప్లే ఆఫ్స్‌ కు వెళుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో అన్యాయంగా ఔట్‌ ఇచ్చారని గుజరాత్‌ కీపర్‌, ఆసీస్‌ ప్లేయర్‌ మ్యాథ్యూ వేడ్‌ ఆగ్రహానికి గురయ్యాడు.

శుభమన్‌ గిల్‌ ఔటయ్యాక నిన్న క్రీజులోకి వేడ్‌ వచ్చాడు. 13 బంతులాడి రెండు ఫోర్లు, సిక్స్‌ తో మంచి టచ్‌ లో కనిపించాడు వేడ్‌. అయితే.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ లో ఆరో ఓవర్‌ వేసిన గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌ బౌలింగ్‌ లో రెండో బంతికి అంపైర్‌ అతడిని ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ ఇచ్చాడు. దీంతో.. డ్రెస్సింగ్‌ రూం కు వెళ్లిన వేడ్.. హెల్‌ మెట్‌, బ్యాట్‌ ను కోపంగా విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news