‘కేజిఎఫ్ 2 ‘పాన్ ఇండియా మూవీనా…ఇది పెద్ద జోక్: హీరో సిద్ధార్థ్

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కేజిఎఫ్ -2 సక్సెస్ పై తాజాగా హీరో సిద్ధార్ద్ స్పందించారు. సినిమాల్లో కొన్నింటిని పాన్ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా ఉందని వ్యాఖ్యానించారు. తన తదుపరి సిరీస్ ‘ఏస్కెప్ లైవ్’ ప్రమోషన్ లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా పాన్ ఇండియా కాన్సెప్ట్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“పాన్ ఇండియా వినడానికి ఎంతో ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి నేను వివిధ భాషల్లో చిత్రాలు చేస్తున్నా.. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్ గా, టాలీవుడ్ చిత్రాలు చేస్తే పక్క తెలుగింటి అబ్బాయిలా.. ఇలా ఏ భాషలో వర్క్ చేస్తే ఆ భాషలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. వేరే వాళ్ల చేత డబ్బింగ్ చెప్పించుకోను, నా వరకు ఆయా చిత్రాలను ఇండియన్ ఫిలిమ్స్ అని పిలవడమే ఇష్టం అన్నారు. ఎందుకంటే పాన్ ఇండియా అంటుంటే కాస్త గౌరవంగా అనిపిస్తుంది. వేరే ఎవర్నో ఇబ్బంది పెట్టాలని ఇలా చెప్పడం లేదు.

చిత్ర పరిశ్రమలో హిందీ సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆ భాష నుంచి విడుదలైన సినిమాలు ప్రేక్షకాదరణ పొందితే వాటిని బాలీవుడ్ అనే అంటారు. కానీ ప్రాంతీయ చిత్రాలు విశేషమైన ప్రేక్షకాదరణ పొంది భారీ విజయాన్ని అందుకున్నప్పుడు వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం..? భారతీయ చిత్రమని అభివర్ణించవచ్చు కదా.. లేదా కేజిఎఫ్ జర్నీని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. కాబట్టి పాన్ ఇండియన్ సినిమా అని కాదు ఇండియన్ ఫిల్మ్ అని చెప్పండి. పాన్ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు.. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది అని సిద్ధార్ద్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news