ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మంచి పొజిషన్ లోకి రావాలని అనుకుంటూ ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగా కష్టపడకపోవడం చిన్న చిన్న తప్పులు చేయడం వలన అనుకున్నది సాధించలేకపోతుంటారు. మధ్యలో వచ్చే అవాంతరాలని ఎదుర్కోలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు దీంతో ముందుకు వెళ్లలేకపోతు ఉంటారు. అనుకున్న వాటిని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు కన్న కలలు ఆశయాలు అన్ని కూలిపోతూ ఉంటాయి. అలా కాకుండా అనుకున్నది కచ్చితంగా సాధించాలంటే వీటిని తప్పక గుర్తు పెట్టుకోండి.
ముందు మీరు మీ లక్ష్యాలని స్పష్టంగా ఏర్పరచుకోవాలి మీరు మీకు సాధ్యమయ్యే లక్ష్యాలని మీరు ఏర్పరచుకుని వాటి మీద దృష్టి పెట్టాలి. అయితే అనుకున్నది సాధించే క్రమంలో మీరు విభజించుకుంటూ వెళ్లాలి. మెయిన్ టార్గెట్ మీద ఫోకస్ చేయడం కంటే దానిని రీచ్ అవ్వడానికి మీరు విభజించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. చాలామంది చదివింది మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా చదివింది గుర్తుండాలంటే రీ కాల్ చేస్తూ ఉండాలి. సబ్జెక్టుకి సంబంధించి వీడియోలు చూడడం లేదంటే ఒకసారి రివైజ్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి.
ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడే బాగా బుర్రకు ఎక్కుతుంది అలానే మీరు చదివింది మీకు ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి ఇతరులతో మీరు చెప్పండి లేకపోతే అద్దంలో మీకు మీరే చెప్పుకోండి. మీరు చదివిన దానిని విజువల్ రూపంలో గుర్తు పెట్టుకుంటే ఎక్కువ కాలం మీకు గుర్తుంటుంది. అలానే అదే పనిగా చదువుకోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని చదవండి. ముఖ్యమైన పాయింట్స్ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించండి ఒక నోట్స్ లో రాసుకుంటూ ఉండండి చాలామంది రాత్రుళ్ళు నిద్రపోకుండా చదివేస్తూ ఉంటారు కానీ నిద్ర కూడా చాలా ముఖ్యం లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.