సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ రికార్డులు సృష్టి స్తున్నారు. సెంచరీల మోత మోగిస్తున్నారు. తన కేరీర్ లో ఇప్పటి వరకు 11 సెంచరీలను నమోదు చేశాడు. ఇది క్రికెట్ లెక్కులు కాదండి.. బాలయ్య బాబు.. 100 రోజుల ఆడిన సినిమాల సంఖ్య. మొన్నటి వరకు బాలయ్య 10 సినిమాలు 100 రోజుల ఆడాయి. తాజా గా టాలీవుడ్ సంచలనం అఖండ కూడా 100 రోజుల ఆడటంతో బాలకృష్ణ తన కేరీర్ లో 11వ సెంచరీని నమోదు చేశాడు.
దీంతో చిత్ర సిమలో సినిమాల్లో 11 సెంచరీలను పూర్తి చేసిన ఏకైకా హీరోగా బాలకృష్ణ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు రాయలసీమలో నమోదు అయింది. రాయలసీమలో బాలయ్యకు అభిమానులు ఎక్కువ గా ఉంటారు. బాలయ్య సినిమా అంటే.. చాలు అక్కడ పండగ వాతావరణమే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో అయితే బాలయ్య క్రేజ్ పీక్స్ లో ఉంటుంది.
కర్నూల్ జిల్లాలోని ఎమ్మిగనూర్ లో బాలయ్య పేరు పై అరుదైన రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 11 బాలయ్య సినిమాలు ఏక దాటిగా 100 రోజుల ఆడాయి. రోజుకు నాలుగు ఆటల చోప్పున 100 రోజుల పాటు 11 సినిమాలు ఆడాయి. తాజా గా వచ్చిన అఖండతో ఈ రికార్డును బాలయ్య సృష్టించబోతున్నాడు. అతి కొద్ది రోజుల్లోనే అఖండ సినిమా 100 రోజులను ఆడింది. కాగ ఇప్పటి వరకు ఇక్కడ 100 రోజుల ఆడిన బాలయ్య సినిమా వివరాలు..
1. పెద్దన్నయ్య – 104 రోజులు : (1997)
2. సమరసింహారెడ్డి – 177 రోజులు : (1999)
3. నరసింహానాయుడు – 176 రోజులు : (2001)
4. చెన్నకేశవరెడ్డి – 105 రోజులు : (2002)
5. లక్ష్మీనరసింహా – 102 రోజులు : (2004)
6. సింహా – 107 రోజులు : (2010)
7. లెజెండ్ – 421 రోజులు : (2014)
8. డిక్టేటర్ – 103 రోజులు : (2016)
9. గౌతమీపుత్ర శాతకర్ణి – 105 రోజులు : (2017)
10. జై సింహా – 100 రోజులు : (2018)
11. అఖండ – 100 రోజులు + : (2021)