సరికొత్త లుక్​ లో అదరగొడుతున్న అక్కినేని హీరో అఖిల్

-

టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నటవారసుడు నాగార్జున తనయుడు అఖిల్(akhil) గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇన్ని రోజులూ ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ హీరోకు ఇంత వరకు కెరీర్ లో సరైన హిట్ పడలేదు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ కోసం పరితపించి భంగపడ్డ ఈ హీరో ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉండనుందని సమాచారం. సురేందర్ రెడ్డి సినిమాలంటేనే హీరోల గెటప్ పూర్తిగా మార్చేస్తాడని టాక్ ఉంది. గతంలో ఆయనతో సినిమాలు చేసిన మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గెటప్ లను గుర్తు పట్టలేకుండా మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ ను కూడా అలాగే మార్చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.

అఖిల్/akhil
అఖిల్/akhil

ఇన్ని రోజులు లవర్‌ బాయ్‌గానే తెరమీద కనిపించిన అఖిల్ సరేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న నూతన మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే… ఈ ఫొటోలో అఖిల్ బాడీ సిక్స్ ప్యాక్ ఉంది. ఇలా సిక్స్ ప్యాక్ తో మెస్మరైజ్ చేస్తున్న అఖిల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏజెంట్ మూవీ టీం బాడీ బిల్డర్ లా ఉన్న అఖిల్ ఫొటోను పోస్ట్ చేస్తూ… ఇది ఆరంభం మాత్రమే… ముందుంది అసలు పండుగ అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక ఈ ఫొటోలో అఖిల్ వీపు మీద మేక టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కరోనాతో వాయిదా పడ్డ ఈ మూవీ టీం రేపట్నుంచి షూటింగ్ మొదలు పెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news