కేంద్రంలోని బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి : అఖిలేశ్‌ యాదవ్‌

-

ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ హాజరయ్యారు. తాజాగా ఖమ్మం బీఆర్ఎస్ సభలో పాల్గొనడంపై అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడం వల్లే తాను వెళ్లానని అఖిలేశ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానించారని అన్నారు అఖిలేశ్ యాదవ్.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని… ఆ పార్టీ గద్దె దిగడానికి కేవలం 398 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో పేదలు, సమాన్యులు ఎవరికీ న్యాయం జరగడం లేదని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను కూడా లాక్కుంటున్నారని దుయ్యబట్టారు అఖిలేశ్ యాదవ్. కొందరు పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లోకి సొంత మనుషులను బీజేపీ గుప్పిస్తోందని అఖిలేశ్ యాదవ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news