హైదరాబాద్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ 10 గేట్లు.. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తడం తో మూసి లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దాంతో జియాగూడ నుండి పురానా పూల్ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు మీదకు భారీగా వరద నీరు చేరుకుంది. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు ఇళ్ల నుండి ఖాళీ చేయిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీతో పాటు తెలంగాణలో గత రెండ్రోజులు భారీ వర్షాలు కురిశాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ నిండిపోయాయి. గోదావరి కూడా పరవళ్లు తొక్కుతోంది. దాంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్ ప్రకటించారు.