తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఈరోజు స్కూల్స్ బంద్..

-

ప్రభుత్వ పాఠశాల లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ తాజాగా కీలక ప్రకటన చేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా.. ఈనెల 5న పాఠశాలల బంద్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొనాలని కోరారు.

ఈరోజు జరగనున్న బంద్ ను విజయవంతం చేయ్యాలని విద్యార్థులకు విద్యార్థి సంఘ నేతలు పిలుపు నిచ్చారు.ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమై దాదాపు నెల గడుస్తున్నా అనేక సమస్యలు పరిష్కారం అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించడకపోవడంపై ఏబీవీపీ నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని హెచ్చరించారు..

తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నసమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న కార్పొరేట్ స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు..జూన్ 2వ తేదీన పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులు పెట్టడంపై సైతం ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన 34 మంది విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు.

అలాగే ప్రభుత్వం విద్యార్థుల పై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలన్నారు. అయితే.. ఈ బంద్ నేపథ్యంలో సెలవు విషయమై పాఠశాలల నిర్వాహకులు, అధికారులు విద్యార్థులకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు..

Read more RELATED
Recommended to you

Latest news