ఈ మధ్య కాలం లో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. అలానే తప్పులు చేస్తే నష్టాలు కూడా తప్పవు. ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు వుంది కదా అని నచ్చినట్టు వాడచ్చు. అలా చేసారంటే రుణ ఊబిలో కూరుకుపోయే అవకాశం వుంది. అందుకే ఈ కార్డ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇది ఇలా ఉంటే ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా క్రెడిట్ కార్డు వాడే వారికి మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ చార్జీలను సవరించింది. ఇవి ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నాయి. క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్లకు బ్యాంక్ ఇకపై 2.5 శాతం ఫీజును వసూలు చేయబోతోంది.
కనీసం రూ.500 చార్జీ పడుతుంది. అదే విధంగా ఈ బ్యాంక్ ఆలస్య రుసుమును కూడా మార్చింది. వాటి వివరాలలోకి వెళితే.. రూ.100లోపు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఉంటే ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించక్కర్లేదు.
అదే రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటే రూ.100 లేట్ పేమెంట్ చార్జీ కట్టాలి. అలానే రూ.501 నుంచి రూ.1000 వరకు అయితే రూ.500 చార్జీ పడుతుంది. రూ.10,000 వరకు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఉంటే అప్పుడు రూ.750, రూ.25 వేల వరకు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఉంటే రూ.900, రూ.50 వేల వరకు అయితే రూ.1000 పడుతుంది. కనుక వీటిని గమనించండి. లేదంటే ఎక్కువ డబ్బులు నష్టపోతారు.