మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు : ఏపీ డీజీపీ వార్నింగ్‌

-

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకులు హిందూ మతం పేరుతో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే.. జిన్నా పేరుతో ఉన్న గుంటూరు టవర్‌ ను కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు ఇలాంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రాజకీయ నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని… వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సినదిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని డిజిపి వార్నింగ్‌ ఇచ్చారు. ఇక ముందు ఏ నాయకులైన మత పరమైన వ్యాఖ్యలు చేయవద్దని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news