Aleti Maheshwar Reddy: స్థానిక ఎన్నికల అనంతరం డిసెంబర్ నెలలోపు రేవంత్ రెడ్డి సీఎం సీటు నుంచి దిగిపోవడం ఖచ్చితంగా జరుగుతుందని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి కొత్త సీఎం వస్తారు అంటూ మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. మోదీని గద్దె దింపడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వల్లనే కాలేదు. నువ్వు బచ్చా నాయకుడివి నీవల్ల ఏమవుతుంది ఏమీ జరగదు.

నీ అవినీతి చిట్టా అధిష్టానానికి తెలిస్తే నీ పదవి పోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చర్చించుకుంటున్నారు అంటూ బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు.