ఆలియా ‘డార్లింగ్స్’ సినిమా ట్రైలర్ అదిరిందిగా..

-

బాలీవుడ్ ప్రిన్సెస్ ఆలియా భట్ స్వీయ నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డార్లింగ్స్‌’. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఆలియా ప్రధాన పాత్రలో.. షెఫాలీ షా, ఎంసీఏ ఫేం విజయ్ వర్మ, రోషన్ మ్యాథ్యూ కీలక పాత్రలో నటించారు. జస్మీత్ కె రీన్ దర్శకురాలు. ఈ సినిమా ఆగస్టు 5న నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

‘నా పేరు హమ్‌జా షేక్‌. నేను బద్రునిసా (అలియా) భర్తని’ అని విజయ్‌ వర్మ చెప్పే సంభాషణతో ప్రారంభమైందీ ట్రైలర్‌. భార్యను ఎంతగానో ప్రేమించే హమ్‌జా ఆమెకు దూరంగా వెళ్లిపోవడం, భర్త కనిపించడం లేదంటూ అలియా పోలీసులకు ఫిర్యాదు చేయడం తదితర సన్నివేశాలతో ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి (రోషన్‌) ప్రవేశించడంతో వీరి కాపురంలో కలతలు వచ్చాయని కొన్ని సన్నివేశాల్ని బట్టి తెలుస్తోంది. మరి, రోషన్‌.. అలియాకు ఎలా పరిచయం అయ్యాడు? అలియా కాపురం ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అలియా ఈ సినిమాలో డీ- గ్లామర్‌గా కనిపించనుంది.

షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, ఆలియా భట్ నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా ‘డార్లింగ్స్‌’ సినిమాను నిర్మిస్తున్నాయి. నిర్మాతగా ఆలియా తొలి చిత్రమిది. ఇవే కాకుండా కరణ్ జోహర్ దర్శకత్వంలో ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, అయాన్ ముఖర్జీతో డైరెక్షన్ లో తన భర్త రణ్ బీర్ కపూర్ తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తోంది. వీటితో పాటు హాలీవుడ్ లో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ షూటింగ్ పూర్తి చేసుకుని లండన్ నుంచి ముంబయి చేరుకుంది ఆలియా.

Read more RELATED
Recommended to you

Latest news