అధికారులు వేధిస్తున్నారంటూ.. బాక్సర్​ లవ్లీనా సంచలన ఆరోపణలు..

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ సంచలన ఆరోపణలు చేసింది. కామన్వెల్త్​ క్రీడలకు సిద్ధమవుతున్న తనను కొంతమంది అధికారులు మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పలువురు అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది లవ్లీనా. ఒలింపిక్స్​లో తాను మెడల్​ సాధించడానికి ప్రోత్సాహించిన కోచ్​లను మారుస్తూ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది లవ్లీనా. తన కోచ్​లను తిరిగి నియమించాలని కోరింది.

BREAKING | Boxer Lovlina Borgohain wins India's second medal at Tokyo  Olympics

అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించింది లవ్లీనా. అసోంకు చెందిన లవ్లీనా ప్రస్తుతం బర్మింగ్‌హోమ్‌లో జరుగబోయే కామన్వెల్త్‌ క్రీడల కోసం సిద్ధమవుతున్నది లవ్లీనా. తాను పతకాలు సాధించడంలో సహకరించిన తన కోచ్‌లలో ఒకరికి కామన్వెల్త్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రవేశం లభించలేదని, రెండోకోచ్‌ను ఇంటికి పంపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. ఎంత అభ్యర్థించినా మానసిక వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కోచ్‌లను మారుస్తూ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం క్రీడలపై ఎలా దృష్టి పెట్టాలో అర్థం కావడం లేదని పేర్కొందని పేర్కొంది. తన కోచ్‌లను తిరిగి నియమించాలని కోరింది లవ్లీనా.