ఆమెను వ‌ద‌లనంటున్న రామ్‌చ‌ర‌ణ్.. చెర్రీ త‌క్కువోడేం కాదుగా!

-

రామ్‌చ‌ర‌ణ్ అంటే తెలుగు ఇండ‌స్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో క‌లిసి జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్‌, పోస్ట‌ర్లు దుమ్ములేపాయి.

అయితే ఈ సినిమాలో చెర్రీకి జోడీగా ఆలియాభ‌ట్ న‌టిస్తోంది. దీంతో వీరి కెమిస్ట్రీ బాగుంటుందంటూ ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్ సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియానే ప్రిఫ‌ర్ చేశాడంట రామ్ చ‌ర‌ణ్‌. ఎందుకంటే ఐదు భాష‌ల్లో తీస్తున్న ఈ సినిమాలో నేష‌న‌ల్ వైడ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బెట‌ర్ అని, అందుకు ఆలియా అయితే బాగుంటుంద‌ని రామ్ చ‌ర‌ణ్ భావిస్తున్నాడంట‌. అయితే దీనిపై శంక‌ర్ మాత్రం ఇంకా క్లారిటీకి రాలేదు. ఒక‌వేల ఆలియానే తీసుకుంటే మాత్రం ఫ్యాన్స్‌కి పండ‌గే.

Read more RELATED
Recommended to you

Latest news