ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఐదు రోజులూ కోడిపందాల పర్మిషన్ కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని లేఖలో కోరారు ముద్రగడ పద్మనాభం. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమని తెలిపారు.
ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన లేఖ లో ప్రస్తావించారు. చివరికి పర్మిషన్ ఇచ్చేయటంతో పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని.. పండుగుల సమయంలో ప్రజలకు పని ఉండదు కాబట్టి ఉత్సవాల్లో పాల్గొంటారని వెల్లడించారు. పండుగలకు ప్రజలు జైలుకు వెళ్లేలా పరిస్థితి ఉండకూడదని.. సి.ఎం.జగన్ కు లేఖలో వివరించారు ముద్రగడ. కాగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి సంక్రాంతి పండుగకు కోడి పందాలు, ఇతర ఆటలు ఆగడం సర్వ సాధారణం. అయితే.. ఈ ఆటలకు పోలీసులు అడుగడుగున అడ్డ కట్ట వేస్తున్నారు.