మనుషుల గాయాలకు చేపల చర్మంతో చికిత్సా..? సేఫేనా..?

-

గాయాలకు పూల పొడి, ఆకుల రసం లాంటివి వాడతారని తెలుసు.. కానీ చేపల చర్మంతో మనుషుల గాయాలకు చికిత్స చేయొచ్చు తెలుసా..? గాయాలు, పుండ్లపై చేప‌ల చ‌ర్మం వేస్తే.. అవి త్వ‌ర‌గా మానుతాయి.. అలా అని అన్నీ చేపల చర్మం పనికిరాదు. కేవ‌లం తిలాపియా అనే ర‌కానికి చెందిన చేప‌ల చ‌ర్మాన్ని మాత్ర‌మే గాయాలు, పుండ్లు మానేందుకు ఉప‌యోగిస్తారట.. అయినా చేపల చర్మం చాలా పలుచగా ఉంటుంది అవి ఎలా గాయాలను నయం చేస్తాయి.. హౌ..!!
తిలాపియా చేప‌ల చ‌ర్మానికి, మ‌నిషి చ‌ర్మానికి ద‌గ్గ‌రి పోలిక‌లు ఉంటాయట. పైగా ఆ చేప‌ల చ‌ర్మంలో నాన్ ఇన్ఫెక్షియ‌స్ మైక్రోబ‌యోటా ఉంటుంది. అంటే మ‌న‌కు మంచి చేసే సూక్ష్మ జీవులు ఉంటాయట.. అందుకే తిలాపియా చేప‌ల చ‌ర్మాన్ని గాయాలు, పుండ్ల‌పై వేసి క‌ట్టులా క‌డితే అవి త్వ‌ర‌గా మానుతాయి. ప్ర‌పంచంలో కొన్ని దేశాల్లో ఈ త‌ర‌హా చికిత్సా విధానం
ఇప్పటికే అమ‌లులో ఉంది.
Brazilian doctors use fish skin to treat burn victims - National |  Globalnews.ca
ఆ చేప‌ల చ‌ర్మాన్ని నేరుగా వాడకూడదు.. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మాత్రమే వాడాలి.. దాన్ని వారు స్టెరిలైజ్ చేస్తారు. త‌రువాత ఉప‌యోగిస్తారు. సాధార‌ణంగా అల్లోప‌తిలో అయితే గాయాలు, పుండ్ల‌పై సిల్వ‌ర్ స‌ల్ఫ‌డియాజైన్‌ను రాస్తారు. దీంతో గాయాలు, పుండ్లు 2 వారాల్లో మానుతాయి. అయితే బ్యాండేజ్‌ల‌ను తరచూ మార్చాల్సి ఉంటుంది. గాయాల‌ను రోజూ క్లీనింగ్‌ చేసి డ్రసింగ్ చేయాలి. స్నానం చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాలి.
కానీ తిలాపియా చేప‌ల చ‌ర్మం అలా కాదు. నేరుగా అప్లై చేసి దానిపై బ్యాండేజ్ వేయ‌వ‌చ్చు. 10 రోజుల్లో గాయాలు, పుండ్లు మానతాయి.. కొంద‌రికి ఇంకా వేగంగానే గాయాలు మానుతాయి. తిలాపియా చేప‌ల చ‌ర్మంలో కొల్లాజెన్ టైప్ 1 అధిక స్థాయ‌లో ఉంటుంది. ఇది గాయాలు, పుండ్ల‌ను త్వ‌ర‌గా మానేలా చేస్తుంది. అందువ‌ల్ల ఈ చేప‌ల చ‌ర్మాన్ని ఒక‌సారి ఉప‌యోగిస్తే చాలు. రిజల్ట్‌ ఉంటుంది. అయితే ఇది కేవ‌లం కొన్ని చోట్ల మాత్ర‌మే అందుబాటులో ఉంది. చాలా మంది ఈ విధానాన్ని ఇంకా ఉప‌యోగించటం లేదు. త్వరలోనే ఈ తరహా వైద్యం అందుబాటులోకి వస్తుంది…

Read more RELATED
Recommended to you

Latest news