సౌతిండియా స్టార్ హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసినదే. విజయ్ అనే వ్యక్తితో పెళ్లి అయినా తర్వాత అమలాపాల్ అతనితో మనస్పర్ధలు గొడవలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. అమలాపాల్ విడాకుల గురించి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో మరియు తమిళ మీడియా వర్గాల్లో గతంలో రావడం జరిగాయి.
అయితే తాజాగా అమలా పాల్ తన భర్త నుండి విడిపోవడానికి కారణం హీరో ధనుష్ అనే వార్తలు తమిళ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఈ విషయం అమలా పాల్ మాజీ భర్త విజయ్ తండ్రి తన కొడుకు కోడలు కాపురం కూలిపోవటానికి కారణం ధనుష్ అని వార్తలు రావడం జరిగింది. దీంతో అమలాపాల్ ఇటీవల ఓ వేడుకకు హాజరైన సందర్భంలో మీ మాజీ భర్త విజయ్ తో విడిపోవడానికి కారణం ధనుష్ అంటూ వస్తున్న వార్తల పై మీ కామెంట్ ఏంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
వేరొకరి వల్ల భార్య భర్తలు విడిపోతారు అన్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని అమలాపాల్ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరి మధ్య ఎవరిదో ఒకరి తప్పు ఉంటేనే విడిపోవడం జరుగుతుందని ఇండైరెక్టుగా మాజీ భర్త విజయ్ దే కారణం అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా తనకు ధనుష్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.