స్టైలిష్ స్టార్ బన్నీ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా వుంటున్నారు. బన్నీ వైఫ్ స్నేహారెడ్డి కూడా అంతే యాక్టీవ్‌గా వుంటూ పలు ఆసక్తికరమైన ఫొటోల షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అల్లు అర్హా.. అయాన్‌లకు ఘోస్ట్‌లుగా మేకప్ చేసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎవ్రీ ఇయర్ వెస్ట్రన్ ఫెస్టివెల్ హాలోవీన్‌ని బన్నీ ఫ్యామిలీ సెలబ్రేట్ చేస్తోంది. ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా బన్నీ ఫ్యామిలీ హాలోవీన్ పార్టీని ఎంజాయ్ చేసింది. బన్నీ వైఫ్ స్నేహారెడ్డి తన చిల్డ్రన్స్ అల్లు అర్హాని నన్‌గా, అల్లు అయాన్‌నిపెన్నీవైస్ గెటప్ లో సిద్ధం చేయడంతో ఇద్దరూ కలిసి సందడి చేశారు. ఆ ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ముత్యంశెట్టి మీడియా తో కలిసి మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.