మళ్ళి అదే జానర్ లో బన్నీతో సినిమా తీస్తున్న సుకుమార్….??

-

టాలీవుడ్ లో వెరైటీ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన సుకుమార్, మధ్యలో కొన్ని చిన్న సినిమాలకు కథలు కూడా అందించడం జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆర్య సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన సుకుమార్, తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత రామ్ తో తీసిన జగడం, అలానే మరొక్కసారి బన్నీతో ఆయన తీసిన ఆర్య 2 సినిమాలు కూడా ఫ్లాప్స్ గా నిలిచాయి. అనంతరం నాగ చైతన్య, తమన్నా ల కలయికలో వచ్చిన 100% లవ్ తో సూపర్ హిట్ కొట్టాడు సుకుమార్.
దాని అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో వన్ నేనొక్కడినే వంటి డిజాస్టర్ ని, ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాతో సక్సెస్ ని ఆయన అందుకోవడం జరిగింది. ఇక గత ఏడాది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆయన తీసిన రంగస్థలం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే అతి త్వరలో బన్నీతో కలిసి ముచ్చటగా మూడవసారి ఆయన తీయబోయే సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి.
Allu Arjun Next project with director Sukumar
Allu Arjun Next project with director Sukumar
అయితే కెరీర్ లో తాను తీసిన సినిమాల్లో ఎక్కువగా రివెంజ్ బ్యాక్ స్టోరీస్ ని నమ్ముకుని కథలు రాసుకున్న సుకుమార్, మరొక్కసారి బన్నీ సినిమాకు కూడా అదే విధమైన కథను అందించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. కొద్దిరోజులుగా గంధం చెక్కల మాఫియా ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ, అంతర్లీనంగా ఇది కూడా ఒక పక్కా రివెంజ్ డ్రామా అని సమాచారం. మరి ఆర్య 2 తో నిరాశపరిచిన ఈ జోడి, మళ్ళి ఇన్నేళ్ల తరువాత చేస్తున్న ఈ సినిమాతో ఎంతమేరకు సక్సెస్ ని అందుకుంటారో చూడాలి. కాగా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది….!!

Read more RELATED
Recommended to you

Latest news