ఒంటరిగా ఉంటే మానసిక ఆరోగ్యానికి మంచిది..!

-

శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ విధంగా ఫాలో అయితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఒంటరిగా సమయాన్ని గడపడం వల్ల మనిషిలో మానసిక ఆరోగ్యం పెరుగుతుందని.. ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అందుకనే మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కాసేపు ఒంటరిగా సమయాన్ని వెచ్చించండి.

 

depression1

మీరు ఒంటరిగా ఉండడం వల్ల ఎంతో కంఫర్ట్ గా ఉండొచ్చు. అలానే మీ నుండి నెగటివిటీ కూడా పూర్తిగా దూరం అయిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఇతరుల ప్రభావం మీ మీద పడకుండా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కూడా వీలు అవుతుంది. అదే విధంగా క్రియేటివిటీ కూడా మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

అలానే ఒంటరిగా కూర్చుని తినడం, ఒంటరిగా కూర్చుని ఉండడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలానే మిమ్మల్ని ఎంతో రిలాక్స్ గా కూడా ఉంచుతుంది. కాబట్టి మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అదే విధంగా ఒత్తిడి తగ్గడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. కనుక మీ సమయంలో కాస్త సమయాన్ని మెడిటేషన్ కోసం కూడా వెచ్చించండి. ఒకవేళ కనుక మీ మానసిక ఆరోగ్యం అసలు బాగోలేదు అంటే మానసిక నిపుణులు ని కన్సల్ట్ చేయండి. తద్వారా సమస్య నుండి మీరు స్లోగా బయటపడొచ్చు. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news