మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ దూకుడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. అన్ని మెజారీటీ పోస్టుల్లో విష్ణు ప్యానెల్ దూకుడు ప్రదర్శిస్తోంది. విష్ణు ప్యానెల్ నుంచి ట్రెజరల్ గా శివబాలాజీ గెలుపొందగా, జనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన రఘుబాబు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవితపై ఏడు ఓట్ల మెజారిటీలో గెలుపొందినట్లు సమాచారం.

మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్  రాజ్ పై మంచు విష్ణు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా విజయం ఖరారైనట్లు సమాచారం. అయితే ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గాపోటీ చేేస్తున్న శ్రీకాంత్, మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న బాబూ మోహన్ పై భారీ తేడాతో విజయం సాధించారు.