న‌టుడే కాదు.. నాగార్జున‌లో ఈ కోణాలు కూడా ఉన్నాయా..?

-

కింగ్ నాగార్జున‌.. అప్ప‌టికీ.. ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ.. ఈయ‌న మ‌న్మ‌థుడే అంటారు. 1986 లో వచ్చిన `విక్రమ్` సిన‌మాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైనా అక్కినేని నాగార్జున.. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు న‌టించిన త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. అయితే దివంగ‌త న‌టి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం మూవీనే నాగార్జునకు ఫ‌స్ట్ స‌క్సెస్‌ను అందించిన మొదటి చిత్రం. ఇక శివ చిత్రంతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఆ తర్వాత గీతాంజలి, మజ్ను వంటి భగ్న ప్రేమికుడి పాత్రలో నటించి విప‌రీత‌మైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

అలాగే ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ ముఖ్యంగా శివ‌మ‌ణి వంటి చిత్రాల‌తో ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. భక్తిరస చిత్రాలు సైతం చేసి ప్రేక్షకులను మెప్పించిన ఘనత నాగార్జునకే దక్కింది. ఎలాంటి క్యారెక్ట‌ర్ అయినా తాను మెప్పించ‌గ‌ల‌ను అని నాగార్జున నిరూపించుకున్నారు. అయితే ఈయ‌న న‌టుడే కాదు.. మ‌రో కోణం కూడా ఉందంటున్నారు నాగార్జున స‌తీమ‌ణి అమ‌ల‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలంలో సామాన్యుల‌తో పాటు సినీ తార‌లు కూడా ఇంటికే ప‌రిమితం అయ్యాయి.

అయితే ఇలా ఇంటికే పరిమితమైన అక్కినేని అమలను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ క్ర‌మంలోనే అమ‌ల కొన్ని ఆస‌క్తికర విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. ఈ ఇంటర్వ్యూ లో సమంత కుటుంబ సభ్యుల కోసం ఎప్పుడైనా వంట చేశారా అన్న ప్రశ్నకు స‌మాధానంగా.. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున వంటి చేయితిరిగిన కుక్ ఉండగా, మరొకరు వంట చేయడం ఎందుకని చెప్పుకొచ్చారు. నాగార్జున మంచి న‌టుడే కాదు.. వంట చేయడంలో కూడా మిస్ట‌ర్ పర్ఫెక్ట్. దీంతో సమంతకు ఆ అవకాశం రాలేదని వెల్లడించారు. అంతేకాదు, తనకు కూడా వంట సరిగా రాదని అమల వెల్ల‌డించ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news