న్యూఢిల్లీ: అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. భూములపై సీఐడీ, సిట్ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ల్కాండ్ స్కామ్ చోటు చేసుకొందని ఏపీ సర్కార్ చెబుతోంది. ఈ మేరకు మంత్రుల కమిటీ ఓ నివేదికను కూడా ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ, సిట్ విచారణ జరిపింది. ఈ విచారణపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబునాయుడు ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కార్ ఆరోపణలు చేస్తోంది.