పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్… కేవలం రూ.100 కడితే రూ.20 లక్షలు రిటర్న్స్..

-

చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తున్న ప్రభుత్వం రంగ సంస్థ పోస్టాఫీసు ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు కొత్త పథకాలను అందుబాటు లోకి తీసుకొని వస్తుంది..వీటిలో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు..అధిక వడ్డీ కూడా రావడంతో ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.పొదుపు పథకాలపై వడ్డీ రేటును ఏప్రిల్ 01 నుంచి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, పోస్ట్ ఆఫీస్ పెట్టుబడికి మంచి ఎంపికనే చెప్పాలి..

 

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ఒక చిన్న పొదుపు పథకం. ఇందులో కేవలం 100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఇందులో పెట్టుబడిదారుడికి సంవత్సరానికి 6.8% వడ్డీ లభిస్తుంది… ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ రూ.20లక్షల వరకు పొందోచ్చు.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలుగా నిర్ణయించబడింది. పెట్టుబడిదారులు కొన్ని షరతులతో 1 సంవత్సరం తర్వాత ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు.ఆర్థిక సంవత్సరంలో ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.పన్ను మరియు పెట్టుబడిదారులు కేవలం 100 రూపాయలతో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు..

ఇకపోతే ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం ఐదేళ్లలో లక్షాధికారి అవ్వండి. పెట్టుబడిదారుడు ఈ పథకంలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఐదేళ్ల తర్వాత నికర లాభం రూ.1,38,949 అవుతుంది. మీరు 5 సంవత్సరాల తర్వాత రూ. 20.85 లక్షలు కావాలనుకుంటే, మీరు 5 సంవత్సరాలలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీకు వడ్డీగా 6 లక్షలు. లాభం పొందుతారు.. త్వరపడండి..

Read more RELATED
Recommended to you

Latest news