ఇటీవల రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీని గందరగోళానికి గురిచేశాయి అని చెప్పాలి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ పలాడడం వలన టీడీపీ ఒక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకుంది. అందుకు వైసీపీ అధిష్టానం అనుమానించిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వారిలో ఉండవల్లి శ్రీదేవి మరియు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు జగన్ తాడేపల్లి లోని సీఎం ఆఫీస్ లో వైసీపీ ప్రజాప్రతినిధులతో మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో ఉదయగిరి కి సంబంధించి ఇంచార్జి ని నియమించే విషయంలో నిర్ణయం తీయూసుకుంటారని తెలుస్తోంది.
దాదాపుగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు ఖాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్ లో జగన్ ఎవరిపనితనం మీద అయినా ఏమైనా చర్యలు తీసుకుంటాడా ? ఏమైనా ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయా ? మరి చూద్దాం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు.