క‌రోనా ఎఫెక్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు మూసివేత‌.. కేవ‌లం ఆ స‌రుకులే డెలివ‌రీ..!

-

క‌రోనా వైరస్ వ‌ల్ల ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు కూడా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాయి. త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అయితే వినియోగ‌దారుల‌కు అవ‌సర‌మైన నిత్యావ‌స‌రాలు, హెల్త్‌, హైజీన్ ఉత్ప‌త్తుల‌ను మాత్రం డెలివ‌రీ చేస్తామ‌ని ఆ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం నుంచే ఆ సంస్థ‌లు త‌మ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తున్నాయి.

amazon and flipkart shutdown services

క‌రోనా నేప‌థ్యంలో త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తున్నామ‌ని, వినియోగదారుల‌కు అవ‌స‌రం ఉన్న వ‌స్తువుల‌నే ప్ర‌స్తుతం డెలివ‌రీ చేస్తున్నామ‌ని.. అమెజాన్ ఇండియా గ్లోబ‌ల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగ‌ర్వాల్ తెలిపారు. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా త‌న సైట్‌లో కోవిడ్-19 కార‌ణంగా త‌మ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

వినియోగ‌దారుల‌కు అవ‌స‌రం ఉన్న నిత్యావ‌స‌రాలు, ప్యాక్డ్ ఫుడ్‌, హెల్త్ కేర్‌, హైజీన్‌, ప‌ర్స‌న‌ల్ కేర్ ఉత్ప‌త్తుల‌ను మాత్ర‌మే ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు డెలివ‌రీ చేస్తున్నాయి. అయితే మిగిలిన ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ నిర్ణ‌యాల‌ను ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news