హంటా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇబ్బంది పెడుతున్న తరుణంలో బయటకు వచ్చిన హంటా వైరస్ ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. దీని బారిన పడి ఒక వ్యక్తి చైనాలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఈ వైరస్ విస్తరించే అవకాశాలు ఉన్నాయని గతంలో దీని బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, మరి కొంత మందికి ఇది సోకే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యలు చేసారు.

దీని గురించి అనవసరంగా హడావుడి చేస్తున్నారు. లేని హడావుడి చేస్తూ ప్రజలను మరింత కంగారు పెడుతున్నారు. అయితే దీని గురించి అంత ఆందోళన అవసరం లేదని దాని వలన ఎవరూ చనిపోయే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి మందు అందుబాటులో ఉందని 2016 లోనే దీనికి మంది కనిపెట్టారని చెప్తున్నారు. ఎలుకల్లో ఉండే ఈ వైరస్… ఎలుకలు మనుషుల్ని కుట్టినా,

ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా, ఎలుకల లాలాజలం తిన్నా, ఎలుకల వ్యర్థాల్ని తిన్నా తద్వారా వైరస్ వస్తుంది. ఇది అంటుకునే వ్యాధి అసలు కాదు. మన దేశంలో చాలా ఎలుకలు ఉన్నా వాటిని కక్కుర్తి పడి తినే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరిద్దరు తిన్నా వాటిని వండి తినడమే గాని చైనా మాదిరిగా వెకిలి తిండి తినే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు 3000 మంది వైరస్ బారిన పడగా… 190 మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news