పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఒక బానిస అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఈ సైకో చేష్టలు?? ఈ దాడిని పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించ లేదు?? అని ఆగ్రహించారు. భస్మాసుర హస్తం నీ మీద నువ్వే పెట్టుకుంటున్నావ్… జనసేన కాదు బాబుసేన అని ఎద్దేవా చేశారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలు అంటారని.. ఇక్కడ మాత్రం సైనికులట అంటూ సెటైర్లు పేల్చారు.
పోలీసులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు అంబటి రాంబాబు. హింసను ప్రేరేపించే ఏ రాజకీయ పార్టీ బతికి బట్టకట్టదన్నారు. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కామెంట్స్ పై అంబటి రియాక్ట్ అయ్యారు. మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయమని.. మూడు కాకపోతే నాలుగు చేసుకోమనండని చురకలు అంటించారు. అవసరమైన వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారని.. పవన్ కళ్యాణ్ సలహా ఇవ్వటానికి ఏముందని నిప్పులు చెరిగారు.