నక్సలైట్ల బాంబులకు భయపడని బాబు.. ఆ ఒక్క మాటకు భయపడ్డారా..?

-

టీడీపీ అధినేత చంద్రబాబు తాను దేనికీ భయపడనంటుంటారు. తాను ఎన్నడూ తప్పు చేయలేదని వాదిస్తుంటారు. తాను నిప్పు అంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. నక్సలైట్లు బాంబులు వేసినా పట్టించుకోలేదని ముందుకే వెళ్లానని చెప్పుకుంటారు. అయితే ఆయన చెప్పేదంతా నిజమేనని వైసీపీ నేతలు వేళాకోళం చేస్తున్నారు.

23 బాంబులు పెట్టినా భయపడలేదు చంద్రబాబు అంటున్నాడు.. కానీ కేసీఆర్‌ ఒక్క మాట అంటే భయపడి పారిపోయి వచ్చారని విమర్శిస్తునత్నారు. ఏంటీ నీ ధైర్యం చంద్రబాబూ… 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను కేసీఆర్‌ కేకకు భయపడి పారిపోయి వచ్చావు అని వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అమరావతి అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావు.. భ్రమరావతి నిర్మించావు.. అమరావతిలో కొన్ని వేల కోట్లు కాజేసి దొంగ జపం చేస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబూ అని అంబటి చురకలు అంటించారు.

చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ పొంతన లేని మాటలతో జగన్ ను విమర్శిస్తున్నారని అంబటి రాంబాబు అంటున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ దేవాలయంలో తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నాడో లేదో అని పవన్ మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ హయాంలో లేని మత ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది.. వైయస్‌ఆర్‌ అనేకసార్లు తిరుపతి వెళ్లారు.. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఎందుకు రాలేదని అంబటి ప్రశ్నిస్తున్నారు. పనిగట్టుకొని పవన్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వైయస్‌ జగన్‌పై మతప్రస్తావన చేస్తున్నారని మండి పడుతున్నారు.

పాదయాత్రకు ముందు వైయస్‌ జగన్‌ వెంకటేశ్వరస్వామి దగ్గరకు కాలినడకన వెళ్లి దర్శించుకున్నారని అంబటి రాంబాబు గుర్తు చేస్తున్నారు. పాదయాత్ర పూర్తయిన తరువాత కూడా కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు దేవుడంటే విశ్వాసం ఉంది. ఎక్కడైనా స్తంభం కనిపిస్తే అది శిలువ అని కొన్ని పత్రికల్లో రాయడం దానికి చంద్రబాబు దరువు వేస్తున్నాడన్నారు అంబటి రాంబాబు. వైయస్‌ జగన్‌ హిందూ వ్యతిరేకి అని ముద్రవేయాలని చూస్తే ప్రజలు, మతాలు క్షమించరన్నారు అంబటి.

Read more RELATED
Recommended to you

Latest news