దొరికిన దొంగలకు మర్యాద చేయలేదని వాదిస్తున్నారు : అంబటి రాంబాబు

-

చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు నేరం చేయలేదు అని ఎక్కడా చెప్పడం లేదని, దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు సిద్ధంగా లేని వాదనలు వినిపిస్తున్నారని , అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారన్నారు. సిమెన్స్ కంపెనీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు అని చెప్తోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు జీవితం అంతా స్టేలే అని, ఆషామాషీగా చంద్రబాబు అరెస్ట్ జరగలేదన్నారు.

అంబటి నోటి పారుదల శాఖామంత్రి; ఆయన తలకి రంగు వేయనిది అందుకేనట!! | Ambati  rambabu Minister of oral drainage; jansena leader said why ambati did not  dye his hair!! - Telugu Oneindia

అంతేకాకుండా.. ‘దొంగలు చాలా సార్లు తప్పించుకుంటారు కానీ అన్ని సార్లు తప్పించుకోలేరు. లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ లో అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసులో లోకేష్ తప్పించుకోవటం అసాధ్యం. పురందేశ్వరి ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబును వదిలి వేయమని చెప్పడానికే. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని రాయబారం తీసుకువెళ్లారు. ఏపీ లో లిక్కర్ స్కామ్ అని దిక్కుమాలిన లెటర్ పట్టుకుని వెళ్లారు. రోజా పై మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలను పురంధరేశ్వరి ఎందుకు ఖండించ లేదు?? పవన్ పీకే కాదు…కేకే…కిరాయి కోటిగాడు. పవన్ కాపులను గంపగుత్తగా టీడీపీకి తాకట్టు పెట్టేసారు’ అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news