ఇజ్రాయెల్–​ పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా పోస్ట్‌.. ఆఫర్లు కట్‌

-

పోర్న్​ స్టార్​గ్‌గా పేరొందిన మియా ఖలీఫా ఇజ్రాయెల్–​ పాలస్తీనా యుద్ధంపై చేసిన కామెంట్స్​ ఆమెను అగాథంలోకి నెట్టాయి. ఇజ్రాయెల్​పై విరుచుకుపడ్డ హమాజ్​ మిలిటెంట్లు అక్కడి పౌరులను ఊచకోత కోస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రపంచమంతా ఈ దుష్టఖాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మియా ఖలీఫా మాత్రం పాలస్తీనియన్లపే స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొంటూ పోస్టుచేసింది. దీంతో ఆమెను పలు వ్యాపార సంస్థలు ఒప్పందం నుంచి తొలగించాయి.

 

Mia Khalifa sparks backlash for her controversial post about Hamas vs  Israel conflict‘మీ వ్యాఖ్యలు చాలా భయంకరమైనవి. దయచేసి మనిషిలా ఆలోచించండి. శాంతిని నెలకొల్పడానికి బదులు విద్వేషాలను రెచ్చగొట్టకండి.. మిమ్మల్ని బిజినెస్​ డీల్​ నుంచి తప్పిస్తున్నాం’ అని పలు సంస్థలు మండిపడ్డాయి. అయినా వెనక్కి తగ్గనంటూ ఈ నటి మరో పోస్టు పెట్టింది. మియా ఖలీఫా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీయడంతో ఆమెతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తాజాగా పలు కంపెనీలు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఆమె చేసిన ట్వీట్ కారణంగా మియా ఖలీఫాతో చేసుకున్న డీల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్లే బాయ్ మేగజైన్ వెల్లడించింది. వెంటనే తమ ప్లాట్‌ఫారమ్‌లో మియా ఖలీఫా యొక్క “ప్లేబాయ్” ఛానెల్‌ని కూడా తొలగించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news